Bihar : నేడు కాంగ్రెస్ ఛార్జిషీట్ విడుదల

నేడు బిహార్ కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. నేడు ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఛార్జిషీట్ విడుదల చేయనుంది

Update: 2025-10-09 07:22 GMT

నేడు బిహార్ కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. నేడు ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఛార్జిషీట్ విడుదల చేయనుంది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు కాంగ్రెస్ పార్టీ బీహార్ లో ఛార్జి షీట్ విడుదల చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బీహార్ లో ఎన్డీఏ పాలనలో జరిగిన లోటుు పాట్లతో పాటు సమస్యలను కూడా ఛార్జిషీట్లలో ప్రస్తావించనుంది.

బీహార్ లో గత కొన్నేళ్లలో...
దీంతో పాటు గత ఐదేళ్లలో నిరుద్యోగం, అవీనితి పెరిగిందని ఆరోపణ చేయనుంది. దీంతో పాటు తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో కూడా కాంగ్రెస్ నేతలు చెప్పనున్నారు. నేడు ఎన్డీఏ ప్రభుత్వంపై విడుదల చేసే ఛార్జిషీటను ప్రజల్లోకి ఇండి కూటమి నేతలు బలంగా తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా ప్రత్నించాలన్న భావనతో ఉంది.


Tags:    

Similar News