మరో ఉచిత పథకాన్ని ప్రకటించిన నితీష్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో ఉచిత పథకాన్ని ప్రకటించారు

Update: 2025-07-17 04:40 GMT

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి గెలిచేందుకు ఉచితాలను ఎంచుకుంటునట్లుంది. ఇప్పటికే అనేక పథకాలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. పింఛను మొత్తాన్ని పెంచుతూ ఇటీవల నితీష్ కుమార్ నిర్ణయించారు. దీంతో పాటు పది లక్షల ఉద్యోగాలను ఇస్తామని కూడా యువతను ఆకట్లుకునే ప్రయత్నం చేశారు.

ఉచిత విద్యుత్తు...
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో పథకాన్ని ప్రకటించారు. బిహార్ లో 125 యూనిట్లలోపు విద్యుత్ ఉచితంగా ఇస్తామని బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. ఆగస్ట్ 1వ తేదీ నుంచి పథకం వర్తిస్తుందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు ఉచితాలపై ఎక్కువగా ఆధారపడుతూ వెళుతున్నట్లు కనిపిస్తుంది.


Tags:    

Similar News