అమర్ నాధ్ యాత్ర కు బ్రేక్
ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అమర్ నాధ్ యాత్రను అధికారులు నిలిపేశారు
ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అమర్ నాధ్ యాత్రను అధికారులు నిలిపేశారు. జమ్మూకాశ్మీర్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో అధికారులు అమర్ నాధ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. భారీ వర్షాల కారణంగా భక్తులు ఇబ్బందులు పడటమే కాకుండా కొండ చరియలు విరిగిపడే అవకాశముందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారీ వర్షాలతో...
గండర్ బల్ జిల్లాలో బుధవారం కొండచరియలు విరిగిపడి ఒక మహిళ మృతి చెందిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు వాతావరణ శాఖ జారీ చేసిన భారీ వర్ష సూచన హెచ్చరికలతో ఈరోజు అమర్ నాధ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరినీ నేడు యాత్రకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.