సముద్రంలో అద్భుతమైన ప్రయాణం.. వంతెనను జాతికి అంకితం చేసిన మోడీ

Atal Setu Bridge: దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబయిలో నిర్మించిన..

Update: 2024-01-12 13:37 GMT

Atal Setu Bridge

Atal Setu Bridge: దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబయిలో నిర్మించిన 'అటల్ సేతు' వంతెనను మోదీ జాతికి అంకితం చేశారు. ముంబయి ట్రాన్స్‌ హార్బర్ లింక్ ను ప్రారంభించడంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వంతెన 20 వేల కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ వంతెనపై దాదాపు 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అటల్ సేతు వంతెన 6 లేన్ల సముద్ర లింక్. అంటే రెండు వైపులా 3 లేన్లలో వాహనాలు వెళ్లే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అత్యవసర లేన్ కూడా నిర్మాణం చేపట్టారు.

ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ వంతెనకు టోల్ ట్యాక్స్ మొత్తాన్ని కూడా నిర్ణయించింది. దీనిపై టోల్ ట్యాక్స్ రూ.500గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 22 కిలోమీటర్ల వంతెనపై వెళ్లాలంటే ప్రజలు రూ.250 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక వేగం గురించి మాట్లాడినట్లయితే, ముంబై పోలీసులు ఫోర్-వీలర్, మినీ బస్సు, టూ-యాక్సిల్ వాహనం గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లుగా నిర్ణయించారు. అదే సమయంలో వంతెన ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వేగం గంటకు 40 కి.మీ మించకూడదు.

అంతే కాకుండా ఈ వంతెనపైకి ఆటోలు, మోటారు సైకిళ్లు, మోపెడ్‌లు, ట్రాక్టర్లను అనుమతించరు. ఈ వంతెన ముంబాయి- నవీ ముంబైని కలుపుతుంది. తద్వారా రెండింటి మధ్య దూరాన్ని కేవలం 20 నిమిషాల్లో అధిగమించవచ్చు. ప్రతి చలికాలంలో సముద్రానికి వచ్చే ఫ్లెమింగో పక్షిని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఇందుకోసం వంతెన పక్కన సౌండ్ బారియర్‌ను ఏర్పాటు చేశారు. వంతెనపై పడిన సముద్ర జీవులకు హాని కలగకుండా ఇటువంటి లైట్లు ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా అటల్‌ సేతు వంతెన మొత్తం పొడువు 22 కిలోమీటర్లు. 16.5 కిలోమీటర్ల మేర అరేబియా సముంద్రంపై.. 5.5 కిలో మీటర్ల భూభాగంపై నిర్మించారు. భూకంపాలను సైతం తట్టుకునే విధంగా ఈ వంతెన నిర్మాణం చేపట్టారు.

Tags:    

Similar News