భారత్ లో రాజీకీయ వారసత్వంపై నివేదిక ఏం చెప్పిందంటే?

భారత్ లో రాజీకీయ వారసత్వంపై అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ నివేదికను బయటపెట్టింది.

Update: 2025-09-13 12:14 GMT

భారత్ లో రాజీకీయ వారసత్వంపై అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ నివేదికను బయటపెట్టింది. జాతీయ పార్టీలో అత్యధికంగా 32 శాతంతో తొలి స్థానంలో కాంగ్రెస్, తర్వాతి స్థానంలో 17 శాతంతో బీజేపీలో వారసత్వ నాయకులున్నారని అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దేశ రాజకీయాల్లో వారసత్వ నేపథ్యం ఉన్న నాయకులపై సమగ్ర నివేదిక విడుదల చేసిన అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఏ పార్టీలో ఎంతమంది వారసులు రాజకీయంలో ఉన్నారని వెల్లడించింది.

లోక్ సభ, రాజ్యసభలో...
లోక్‌సభలో మొత్తొ 543 పార్లమెంటు సభ్యుల్లో 167 మంది రాజకీయ వారసత్వ నేపథ్యం ఉన్నవారే. అంటే మొత్తం ఎంపీల్లో 31 శాతం రాజకీయ వారసులేనని అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ చెప్పింది. రాజ్యసభలో 224 మంది ఎంపీల్లో 47 మంది రాజకీయ వారసత్య నేపధ్యం ఉన్నవారేనని వెల్లడించింది. వారసత్వ రాజకీయ నాయకులలో 24 శాతంతో 9వ స్థానంలో తెలంగాణ, 34 శాతంతో ఐదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలున్నాయని పేర్కొంది.


Tags:    

Similar News