Maoists : ఆశన్నతో పాటు 208 మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టు అగ్రనేత ఆశన్నఛత్తీస్ గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Update: 2025-10-17 06:48 GMT

మావోయిస్టు అగ్రనేత ఆశన్నఛత్తీస్ గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆశన్న అలియాస్ తక్కళ్లపల్లి వాసుదేవరి అలియాస్ రూపేష్ లొంగిపోయారు. ఆశన్నతో పాటు 208 మంది మావోయిస్టులు పోలీసులకు సరెండర్ అయ్యారు. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి సమక్షంలో ఆశన్న లొంగిపోయారు. మొత్తం మావోయిస్టులు తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఇటీవల కాలంలో వరసగా మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగులుతుండటంతో పాటు అనేక మంది ఎన్ కౌంటర్లలో మరణించారు.

ములుగు జిల్లాకు చెందిన...
ఈ నేపథ్యంలోనే వరసగా మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు లొంగిపోతున్నారు. జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఇటీవల మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆశన్న తెలంగాణలోని ములుగు జిల్లాకు చెందిన వెంకటాపురం గ్రామానికి చెందిన వారు. నలభై ఏళ్ల క్రితం ఆశన్న ఉద్యమంలోకి వెళ్లారు. ఇరవై ఐదేళ్ల వయసులో అడవుల్లోకి వెళ్లిన ఆశన్న ప్రస్తుతం అరవై ఏళ్ల వయసులో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనపై అనేక కేసులున్నాయి. రివార్డులు కూడా ఉన్నాయి.


Tags:    

Similar News