టర్కీలో మరోసారి భూకంపం
టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈసారి రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతగా నమోదయింది
turkey and syria earthquake update
టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈసారి రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతగా నమోదయింది. టర్కీలో వరస భూకంపాలతో ప్రజలు వణికిపోతున్నారు. ఇటీవల సంభవించిన భూకంపం ధాటికి టర్కీ లో ముప్ఫయి వేల మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.
సహాయక చర్యలు...
ఇంకా కొన్ని చోట్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయకంపితులయ్యారు. అయితే ఈసారి ప్రాణ, ఆస్తినష్టం పెద్దగా జరగలేదని అధికారులు చెబుతున్నారు. టర్కీలో వరస భూకంపాలు వస్తుండటంతో ప్రజలు ఇళ్లలో ఉండేందుకే భయపడిపోతున్నారు.