ఢిల్లీలో మరోసారి భూకంపం
ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు చెందారు
earthquakes in delhi
ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు చెందారు. రిక్టర్ స్కేల్‌పై 2.7 తీవ్రతగా నమోదయింది. మంగళవారం సంభవించిన భూకంపం నుంచి ఇంకా తేరుకోకముందే నిన్న కూడా భూకంపం సంభవించడంతో ఢిల్లీ వాసులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.6గా నమోదయింది.
వరస భూప్రకంపనలతో...
నిన్న రాష్ట్రపతి పద్మ అవార్డులు ప్రదానం చేసే సమయంలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ వాసులు వరస భూప్రకంపనలతో ఆందోళన చెందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.