రాజస్థాన్‌లో భూకంపం
రాజస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రతగా నమోదయిందని అధికారులు తెలిపారు
afghanistan and tajikistan earthquakes
రాజస్థాన్‌లో భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారు జామున రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రతగా నమోదయిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.
రిక్టర్ స్కేల్ పై...
రాజస్థాన్ లో తెల్లవారు జామును భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలు చెందారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. భూ ఉపరితలం నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.