అదానీ.. అంబానీ ఒక్కటై

ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీల మధ్య మరో భాగస్వామ్యం కుదిరింది.

Update: 2025-06-26 11:15 GMT

ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీల మధ్య మరో భాగస్వామ్యం కుదిరింది. వాహన ఇంధన విక్రయం కోసం అంబానీకి చెందిన జియో-బీపీతో అదానీకి చెందిన అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ జట్టు కట్టింది. అదానీ టోటల్‌ గ్యాస్‌కు చెందిన సీఎన్‌జీ విక్రయ కేంద్రాల్లో జియో-బీపీకి చెందిన పెట్రోల్‌, డీజిల్‌ను సైతం విక్రయించనున్నారు. జియో-బీపీ బంకుల్లో అదానీ టోటల్‌ గ్యాస్‌కు చెందిన సీఎన్‌జీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న బంకులతో పాటు భవిష్యత్‌లో ఏర్పాటు చేయబోయే వాటికీ ఈ భాగస్వామ్యం వర్తిస్తుందని ఇరు కంపెనీలు స్పష్టం చేశాయి. బ్రిటన్‌ ఇంధన దిగ్గజం బీపీ పీఎల్‌సీ భాగస్వామ్యంలో ఏర్పాటైన జియో-బీపీ దేశవ్యాప్తంగా 1,972 పెట్రోల్‌ బంకులను నిర్వహిస్తోంది. అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ 34 నగరాల్లో మొత్తం 650 సీఎన్‌జీ విక్రయ కేంద్రాలను కలిగి ఉంది. ఈ సరికొత్త భాగస్వామ్యం ప్రస్తుత అవుట్‌లెట్లతో పాటు భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే అవుట్‌లెట్లకూ వర్తిస్తుంది.

Tags:    

Similar News