మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్ గఢ్ లో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. బుధవారం సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై మొత్తం64 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఇటీవల ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టులు వరసగా లొంగిపోతున్న సంగతి తెలిసిందే.
26 మంది లొంగుబాటు...
ఇప్పటికే అడవుల్లో మావోయిస్టుల బలం దాదాపు ఖాళీఅయింది. ఈ సందర్భంగా కిరణ్ చవాన్ మాట్లాడుతూ, ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టులు హింసను విడిచిపెట్టి అధికారుల ఎదుట లొంగిపోవాలని పిలుపునిచ్చారు. ప్రధాన స్రవంతిలోకి రావాలని ఆయన కోరారు. లొంగిపోయే వారికి ప్రభుత్వ పునరావాస విధానం కింద అన్ని ప్రయోజనాలు అందిస్తామని హామీ ఇచ్చారు.