తల్లి ఖాతాలో 1,13,56,000 కోట్లు

నొయిడాలో దీపక్‌ అనే 20 ఏళ్ల కుర్రాడు తన అకౌంట్ లోకి వచ్చిన డబ్బును చూసి ఒక్కసారిగా షాకయ్యాడు.

Update: 2025-08-06 11:45 GMT

నొయిడాలో దీపక్‌ అనే 20 ఏళ్ల కుర్రాడు తన అకౌంట్ లోకి వచ్చిన డబ్బును చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. రెండు నెలల క్రితం మరణించిన దీపక్‌ తల్లి గాయత్రీ దేవి ఖాతాలో 1,13,56,000 కోట్ల రూపాయలు జమ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. ఉదయం ఆ మెసేజ్‌ చూసిన దీపక్‌ కు అసలు ఏమి జరిగిందో అర్థం కాలేదు. వెంటనే డాంకౌర్‌ పరిధిలోని బ్యాంకుకు వెళ్ళాడు. విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు వెంటనే ఆ ఖాతాను స్తంభింపజేశారు. ఐటీ విభాగం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది.

Tags:    

Similar News