Union Cabinet : నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం.. అమరావతికి గుడ్ న్యూస్
ఈరోజు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.
ఈరోజు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాున్నాయి. మౌలికవసతుల కల్పన సహా కీలకనిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జాతీయ ఉపాధి హామీ పథకంపై కూడా చర్చించనున్నారు. ఇటీవల పేరు మార్చి పనిదినాలను కూడా పెంచిన నేపథ్యంలో దీనిపై మంత్రుల అభిప్రాయాలను ప్రధాని తెలుసుకోనున్నారు.
కీలక నిర్ణయాలివే...
మరొకవైపు రైతులు, ఉద్యోగులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలకు మంత్రి వర్గ సమావేశం ఆమోదించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శాశ్వత రాజధానిపై గెజిట్ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.