నేటి నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ

నేటి నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లను దేశ వ్యాప్తంగా స్వీకరించనున్నారు

Update: 2026-02-26 06:08 GMT

నేటి నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లను దేశ వ్యాప్తంగా స్వీకరించనున్నారు. పది రాష్ట్రాల్లో జరగనున్న 37 రాజ్యసభ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి 6న పరిశీలించనున్నారు. మరోవైపు తెలంగాణలో ఏప్రిల్ 9న బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీల పదవీకాలం ముగియనుంది.

నోటిఫికేషన్ విడుదలకు...
దీంతో ఈ రెండు స్థానాల భర్తీకి ఈసీ నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. శాసనసభలో సంఖ్యాబలం దృష్యా ఈ స్థానాలు కాంగ్రెస్ కే దక్కే అవకాశం కనిపిస్తోంది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుండటంతో నేటి నుంచి అభ్యర్థుల ఎంపిక పై అన్ని పార్టీలూ చర్చించనున్నాయి. తెలంగాణలో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి.


Tags:    

Similar News