అనిల్ అంబానీపై సీబీఐ మరో కేసు నమోదు

పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ ఇల్లు, కార్యాలయాల్లో సీబీఐ మరోసారి సోదాలు నిర్వహిస్తుంది

Update: 2026-02-26 11:39 GMT

పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ ఇల్లు, కార్యాలయాల్లో సీబీఐ మరోసారి సోదాలు నిర్వహిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 2,200 కోట్ల రూపాయలు రుణం తీసుకున్న అనిల్ అంబానీ రుణాల డాక్యుమెంట్స్ ను తారు మారు చేసినట్లు ఆరోపణలపై సీబీఐ సోదాలను నిర్వహించింది. ఈ సోదాల్లో బ్యాంకు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ముంబయిలోని ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి.

బ్యాంకును మోసగించారని...
మరొకవైపు అనిల్ అంబానీపై మరొక కేసును సీబీఐ నమోదు చేసింది. బ్యాంకు రుణపత్రాలను స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు, బ్యాంకులను తప్పుదోవ పట్టించినందుకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. బ్యాంకు రుణాలను తీసుకుని ఎగ్గొట్టడమే కాకుండా పత్రాలను తారు మారు చేయడంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది.


Tags:    

Similar News