నేడు అఖిలపక్ష సమావేశం
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది.
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. కిరణ్ రిజిజు నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో జరగనున్న బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే లోక్ సభ కార్యాలయం ప్రకటించింది.
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో...
రేపటి నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ సమావేశాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు రెండో విడత సమావేశాలు జరుగుతాయి. అందుకే ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించి సభ సజావుగా జరగడానికి సహకరించాలని కోరనున్నారు.