పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి పద్మ అవార్డులను ప్రకటించింది

Update: 2026-01-25 13:04 GMT

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి పద్మ అవార్డులను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు ఈ జాబితాను విడుదల చేసింది. ఈ అవార్డుల కింద దాదాపు 131 మంది ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందని వారు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, రామారెడ్డి మామిడి, పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కుమారస్వామి తంగరాజ్ సీసీఎంబీ శాస్త్రవేత్త. జన్యు సంబధిత వ్యాధులపై ఈయన ఎన్నో పరిశోధనలు చేశారు.

ఏపీ, తెలంగాణకు చెందిన...
మరొకవైపు నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్ లకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. తెలంగాణకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన నలుగురికి పద్మ అవార్డులు లభించాయి. ఐదుగురికి పద్మవి భూషణ్ అవార్డులు లభించాయి. పదమూడు మందికి పద్మ భూషణ్ అవార్డులు లభించాయి. గూడూరు వెంకట్రావు, విజయ్ ఆనంద్ రెడ్డి, గరిమెళ్ల వెంకట ప్రసాద్, వెంపటి కుటుంబ శాస్త్రి, గడ్డమనుగు చంద్రమౌళి, దీపికారెడ్డిలు ఉన్నారు. వీరిని రెండు దశల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు లభించనున్నాయి.


Tags:    

Similar News