Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు అక్కడికక్కడే మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు

Update: 2026-01-27 02:31 GMT

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని పంఢర్ పూర్ - మంగళవేధ మార్గంలో అర్ధరాత్రి సయమంలో ఈ ఘటన జరిగింది. ఒక క్రూజర్ జీప్ ను ఎదురుగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వెంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

యాత్రకు వెళ్లి వస్తుండగా...
వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు వరస సెలవులు రావడంతో తుల్జాపూర్, అక్కలకోట యాత్రకు బయలుదేరి వెళ్లారు. అక్కడ దర్శనాలను చేసుకునన అనంతరం పంఢర్ పూర్ మీదుగా ముంబయికి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఉద్యోగులు తమ కుటుం బసభ్యులతో కలసి యాత్రకు వెళ్లారు. మృతుల్లో ఒక ాలిక కూడా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News