Katnataka : నాలుగు వందల కోట్లు ఎక్కడివి.. ఇంత డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారు?
కర్ణాటకలో పట్టుబడినట్లుగా చెబుతున్న నాలుగు వందల కోట్ల రూపాయల నగదు మిస్టరీ ఇంకా వీడలేదు
కర్ణాటకలో పట్టుబడినట్లుగా చెబుతున్న నాలుగు వందల కోట్ల రూపాయల నగదు మిస్టరీ ఇంకా వీడలేదు. ఇది గుజరాత్ నుంచి మహారాష్ట్ర మీదుగా తిరుపతి వైపు వెళుతుంది. రెండు కంటైనర్లతో వెళుతున్న ఈ నోట్లకట్టలు కర్ణాటక రాష్ట్రంలో దారి దోపిడీకి గురయినట్లు ప్రచారం జరగడం కలకలం రేపుతుంది. ఇంతకీ ఈ డబ్బు ఎవరిది? ఎక్కడకు వెళుతుంది? తిరుపతి మీదుగా తమిళనాడువెళుతుందా? లేక మరే ప్రాంతానికైనా ఈ డబ్బును తరలిస్తున్నారా? అన్న మిస్టరీ మాత్రం వీడటం లేదు. దీనిపై మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు ప్రారంించారు. కానీ కర్ణాటక పోలీసులు మాత్రం నాలుగు వందల కోట్లు దోపిడీకి గురయినట్లు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పేర్కొంటుంది.
ఇన్ని వందల కిలోమీటర్లు...
అసలు నాలుగు వందల కోట్ల రూపాయల కరెన్సీ కట్టలు గుజరాత్ లో బయలుదేరి ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి ఎలా వచ్చాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే దీనిపై రాజకీయ ఆరోపణలు కూడా ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో పంచేందుకు తీసుకెళుతున్న నగదు అంటూ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుున్నాయి. అయితే నాలుగు వందల కోట్ల రూపాయల నగదు దారి దోపిడీకి గురయిందని మహారాష్ట్రలోని నాసిక్ రూరల్ పోలీస్ స్టేషన్ లో గత ఏడాది డిసెంబరు 17వ తేదీన సందీప్ దత్త పాటిల్ అనేక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అతను ఫిర్యాదులో పేర్కొన్న మేరకు గత ఏడాది అక్టోబరు 22న విశాల్ నాయుడు,కిశోర్ శేఠ్ అనే వాళ్లు తనను కి్డ్నాప్ చేశారని, అయితే నాలుగు వందల కోట్లు దారిదోపిడీ చేసింది తానేనంట నెలన్నర పాటు తనను వారు వేధించారని, వారి నుంచి తప్పించుకుని వచ్చి తాను ఫిర్యాదు చేస్తున్నానని తెలిపాడు.
ఉత్తదేనా? నిజమా?
కంటైనర్ లో ఉన్నది నాలుగు వందల కోట్లు కాదని, వెయ్యి కోట్ల రూపాయల వరకూ దోపిడీకి గురయ్యారని తెలిపాడు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసి ఇందుకోసం సిట్ ఏర్పాటు చేసింది. అయితే ఈ వందల కోట్ల దారిదోపిడీ కేసులో ఆరుగురిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నెల 16వ తేదీన తాము కర్ణాటక బెళగావి పోలీసులకు లేఖ రాశామని, దర్యాప్తునకు సహకరించాలని కోరామన్నారు. అయితే దారి దోపిడీ బెళగావి - గోవా మర్గంలోని చోర్లాఘాట్ ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఇది కర్ణాటక పోలీసులు కొట్టిపారేస్తున్నారు. తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, తాము మహారాష్ట్ర పోలీసులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే దోపిడీ జరిగినట్లు ఎటువంటి ఆధారాలు కూడా లేకపోవడంతో ఎలా దర్యాప్తు చేస్తామని కర్ణాటక పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రం వీటిని గాలి పోగేసి ప్రచారం చేయడం తగదని కొందరు సూచిస్తున్నారర.