నేడు దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు
నేడు దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి
నేడు దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలను దేశ వ్యాప్తంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. ఢిల్లీోలని కర్తవ్యపథ్‌లో వందేమాతరం థీమ్‌తో వేడుకలు నిర్వహించనున్నారు. 6,050 మంది సైనికులతో పరేడ్ ఏర్పాటు చేశారు. 17 రాష్ట్రాలు, 13 కేంద్ర ప్రభుత్వ శకటాలు ఇందులో పాల్గొంటున్నాయి.
ఐదంచెల భద్రత...
ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఐదంచెల భద్రత ను కల్పించారు. 30 వేల మంది పోలీసులు, కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. కర్తవ్యపథ్ దగ్గర 6 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. పరేడ్‌కు 10 వేల మంది ప్రత్యేక ఆహ్వానితులు రానున్నారు. ఆహ్వానితులకు ప్రత్యేక పాస్ లను మంజూరు చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివరించనున్నారు.