భారీగా పేలుడు పదార్థాలు.. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా కలకలం

గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారీ స్మగ్లింగ్ ను ఇంటెలిజెన్స్ అధికారులు ఛేదించారు

Update: 2026-01-26 06:35 GMT

గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారీ స్మగ్లింగ్ ను ఇంటెలిజెన్స్ అధికారులు ఛేదించారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు స్మగ్లింగ్ నెట్ వర్క్ ను కనుగొన్నారు. రాజస్థాన్ లో పది వేల కలిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ లో పెద్దయెత్తున పేలుడు సామగ్రి ఉందని నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలోని ఒక ఫామ్ హౌస్ లో ఈ స్మగ్లింగ్ నెట్ వర్క్ ను పనిచేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు భద్రతాదళాలు, స్థానిక పోలీసుల సహకారంతో ఈ దాడులను నిర్వహించారు.

కోట్ల రూపాయల విలువైన...
అయితే అక్కడ పెద్దయెత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 187 బస్తాల అమ్మోనియం నైట్రేట్ తో పాటుగా డిటొనేటర్లు, వైర్లు, మరికొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవి మైనింగ్ కార్యక్రమాల్లో వినియోగించేందుకు తెచ్చారా? మరేదైనా ఉగ్రకుట్రకు పాల్పడాలని తెప్పించారా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సులేమాన్ ఖాన్ అనేక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. రాజస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో మైనింగ్ కార్యక్రమాలను నిర్వహించేందుకు పెద్దయెత్తున అమ్మోనియం నైట్రేట్ తెప్పిస్తారు.
మైనింగ్ కోసమేనా?
మైనింగ్ ను సులువుగా చేసేందుకు ఈ పద్ధతిని చాలా కాలంగా వినియోగిస్తు్న్నారు. అయితే అక్రమ మైనింగ్ కార్యక్రమాలకు పాల్పడే వారికి సులేమాణ్ ఖాన్ వీటిని సరఫరా చేస్తున్నాన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల విలువ కోట్ల రూపాయలలో ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే అమ్మోనియం నైట్రేట్ తో పాటు డిటొనేటర్లు సులేమాన్ ఖాన్ ఎవరెవరికి సరఫరా చేశారన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ పేలుడు పదార్థాల సరఫరాలలో ఇంకెవరి హస్తం అయినా ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద గణతంత్ర వేడుకలకు ముందు ఇంత పెద్దయెత్తున పేలుడు పదార్థాలు లభ్యమవ్వడంతో దేశమంతా హై అలెర్ట్ ను ప్రకటించారు.







Tags:    

Similar News