రేపు అఖిలపక్ష సమావేశం
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉభయ సభల్లో అందరూ సహకరించాలని కోరనుంది. బడ్జెట్ సమావేశాలకు అవసరమైన సమయం ఉంటుంది కాబట్టి అందరికీ మాట్లాడే సమయం ఉంటుందని, అందువల్ల సహకరించాలని కోరనుంద.ి
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో...
జనవరి 27న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. జనవరి 27 ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. జనవరి 28 నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.