నేడు దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె
నేడు దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె చేయాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలిపాయి
నేడు దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె చేయాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలిపాయి. ఒక రోజు దేశ వ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు దిగారు. గత మూడు రోజుల నుంచి బ్యాంకులు పనిచేయలేదు. ఈరోజు సమ్మె కావడంతో నాలుగో రోజు కూడా బ్యాంకులు పనిచేయకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడే అవకాశముంది. ఈ బ్యాంకుల సమ్మెలో AIBEA, AIBOC, NCBE తో పాటు మొత్తం తొమ్మిది బ్యాంక్ యూనియన్లు పాల్గొంటున్నాయి.
ఐదు రోజుల పనిదినాలంటూ...
సుమారు ఎనిమిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈ సమ్మెలో పాల్గొంటుండటంతో బ్యాంకింగ్ కార్యక్రమాలు నిలిచిపోయి ఉన్నాయి. ఎస్.బి.ఐ, పంజాబ్ నేషన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులతో పాటు అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ రంగ సేవలు నిలిచపోనున్నాయి. అయితే ప్రయివేటు బ్యాంకులు మాత్రం యధాతధంగా పనిచేయనున్నాయి.వారానికి ఐదు రోజుల పనిదినాలను కల్పించాలన్న ప్రధాన డిమాండ్ తో బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెకు దిగుతున్నాయి.