హేట్ స్టోరీ సిరీస్ లో ఇప్పటికి మూడు చిత్రాలు రాగా ప్రతి చిత్రం నిర్మాతలకు ఆర్ధిక లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే హేట్ స్టోరీ త్రీ లో అర్ధ నగ్న ప్రదర్శనలతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన కథానాయిక జరీన్ ఖాన్ కు తరువాత చెప్పుకోదగ్గ అవకాశాలు ఏమి రాలేదు. దానితో హేట్ స్టోరీ త్రీ చిత్రాన్ని నిర్మించి విజయవంతమైన నిర్మాతలే ఇప్పుడు మళ్లీ జరీన్ ఖాన్ కి మరో అవకాశం కలిపించారు. అయితే ఈ సారి కథానాయిక పాత్ర కాదు. ఐటెం సాంగ్ లో నృత్యంతో అలరించనుంది జరీన్ ఖాన్.
దాదాపు దశాబ్దన్నర్ర క్రితం వచ్చిన కాంటే చిత్రంలోని మహి వే అంటూ సాగే పాటను నేటికీ ఎన్నో సంగీత ప్రదర్శనలలో ఆలపిస్తుంటారు. అప్పట్లో మాస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ పాటకు రీమిక్స్ గా మరో పాటను స్వరపరచి వాజహ్ తుమ్ హో చిత్రం లో ఐటెం సాంగ్ గా తెరకెక్కించారు. ఈ పాటలో హేట్ స్టోరీ భామ జరీన్ ఖాన్ తన అందాల ఆరబోతతో యువత మతి పోగొట్టేస్తుంది. కథానాయిక నుంచి ఐటెం భామగా మారినా ఈ పాటతో గుర్తింపు పెరిగితే జరీన్ కి మరిన్ని అవకాశాలు వస్తాయి అని నిర్మాతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు