Akhanda : అఖండ 2 సినిమా విడుదలకు బ్రేక్.. హైకోర్టు సంచలన తీర్పు
అఖండ సినిమాకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
అఖండ సినిమాకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అఖండ 2 సినిమా విడుదలను ఆపేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అఖండ 2 నిర్మాణ సంస్థ 14 రీల్స్ తమకు 28 కోట్ల రూపాయలు బకాయీ ఉందని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
నిలుపుదల చేయాలని...
దీంతో సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ ఈ సినిమా విడుదలను నిలుపదల చేయాలని కోరింది. సమస్య పరిష్కారం అయ్యే వరకూ అఖండ 2 సిసినిమా విడుదలను నిలిపేయాలని ఆదేశించింది. దీనిపై 14 రీల్స్ సంస్థ ఏ మేరకు స్పందిస్తుందన్నది చూడాలి. మద్రాస్ హైకోర్టు తీర్పుపై అఖండ నిర్మాతలు పై కోర్టును ఆశ్రయిస్తారా? లేక సమస్యను పరిష్కారం చేసుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది.