Breaking : ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ మృతి
ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ మరణించారు
ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ మరణించారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. శరవణన్ తమిళ, హిందీ, మళయాళం, తెలుగు, కన్నడ భాషల్లో అనేక సినిమాలు నిర్మించారు. ఏవీఎం శరవణన్ గా పేరున్న ఆయన ప్రముఖ నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు. దాదాపు ముూడు వందలకు పైగా సినిమాలను శరవణన్ నిర్మించారు.
తెలుగులో...
తెలుగులో ఆ ఒక్కటీ అడక్కు, శివాజీ, సంసారం ఒక చదరంగం, జెమినీ, మెరుపు కలలు, లీడర్ వంటి సినిమాలను శరవణన్ నిర్మించారు. అనారోగ్య కారణాల వల్లనే శరవణన్ మరణించారని తెలిసింది. దీంతో టాలీవుడ్, కోలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత శరవణన్ మృతితో సినీ రంగంలో ఒక పెద్ద దిక్కు కోల్పోయినట్లయింది.