Akhand 2: అఖండ మూవీ నిర్మాత కీలక నిర్ణయం..బాలయ్యఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

అఖండ 2 మూవీ నిర్మాత సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2025-12-04 13:13 GMT

అఖండ 2 మూవీ నిర్మాత సంచలన నిర్ణయం తీసుకున్నారు. అఖండ 2 ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్లనే ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవని నిర్మాతలు తెలిపారు. అయితే ప్రీమియర్ షోలు రద్దు కావడం ప్రభుత్వ ఉత్తర్వులే కారణమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వచ్చే ఆదాయంలో...
తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఆదాయంలో ఇరవై శాతం కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసిన కాసేపటికే నిర్మాతలు ఈ రకమైన ప్రకటన చేయడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. టిక్కెట్ రేట్లను ఆరు వందల రూపాయలుగా నిర్ణయించారు. అయితే సాంకేతిక కారణాలు అని నిర్మాతలు చెబుతుండటం విశేషం.


Tags:    

Similar News