Samantha : సమంత పెళ్లిపై అసలు వాస్తవమిదే

సినీనటి సమంత ప్రభు మరోసారి వివాహం చేసుకున్నారు.

Update: 2025-12-01 08:25 GMT

సినీనటి సమంత ప్రభు మరోసారి వివాహం చేసుకున్నారు. ఈరోజు ఉదయం ఈశా యోగా సెంటర్ లో సమంత - రాజ్ నిడిమోరు వివాహం జరిగిందని తెలిసింది. ఈ మేరకు మరికొద్దిసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. పెళ్లి ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు సన్నిహిత మిత్రులను, దగ్గర బంధువులును మాత్రమే ఈ వివాహ వేడుకకు ఆహ్వానించారని చెబుతున్నారు. సమంత పెళ్లి విషయం గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది.

ఇద్దరూ కలసి కొంత కాలంగా...
సమంత, రాజ్ నిడిమోరు ఇద్దరూ కలసి డేటింగ్ లో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పలు మార్లు సమంత ఇద్దరు కలసి ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. తాజాగా రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారని, నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత మరోసారి వివాహం చేసుకోవడం పై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. సమంత, రాజ్ నిడిమోరు కలిసి కొన్ని ప్రాజెక్టుల్లో పనిచేయడం వల్ల పరిచయం ఏర్పడి అది వివాహానికి దారి తీసిందంటున్నారు. దీనిపై మరికొద్దిసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.


Tags:    

Similar News