అఖండ-2 విడుదలకు తొలగిన అడ్డంకులు

‘అఖండ 2’ చిత్రం విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

Update: 2025-12-10 16:12 GMT

‘అఖండ 2’ చిత్రం విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కొత్త విడుదల తేదీని నిర్మాణ సంస్థ ‘14 రీల్స్‌ ప్లస్‌’ ప్రకటించింది. డిసెంబరు 12న ఈ సినిమా విడుదల అవుతుందని వెల్లడించింది. డిసెంబర్‌ 5న విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇక ఆర్థిక సమస్యల పరిష్కారం అనంతరం తాజాగా కొత్త తేదీ వివరాలను నిర్మాణ సంస్థ వెల్లడిస్తూ పోస్టర్‌ విడుదల చేసింది. డిసెంబర్ 11న ప్రీమియర్స్‌ ప్రదర్శించనున్నట్లు తెలిపింది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ త్వరలోనే ఓపెన్‌ అవుతాయని స్పష్టం చేసింది. అఖండ 2 రాకతో ఈ వారం విడుదలకు ఇప్పటికే సిద్ధమైన పలు చిన్న చిత్రాలు వాయిదా పడే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News