Telangana : అఖండ 2 మూవీ నిర్మాతకు షాకిచ్చిన తెలంగాణ సర్కార్

తెలంగాణ ప్రభుత్వం అఖండ 2 మూవీ సినిమా విడుదల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2025-12-04 11:58 GMT

తెలంగాణ ప్రభుత్వం అఖండ 2 మూవీ సినిమా విడుదల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాలో వచ్చిన అదనపు ఆదాయంలో ఇరవై శాతం కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. టిక్కెట్ల రేట్లను పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు రాత్రి నుంచి అఖండ 2 సినిమా ప్రత్యేక షోకు ఆరువందల రూపాయల టిక్కెట్ వరకూ పెంచుకోవచ్చని తెలిపింది.

టిక్కెట్ల ధరలను పెంచుకోవడానికే...
డిసెంబరు 5వ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ టిక్కెట్ల రేట్లను పెంచుకోవడానికి అనుమతించింది. టిక్కెట్ల రేట్లను పెంచుకోవడానికి అనుమతిస్తూనే ఈ సినిమా ద్వారా వచ్చిన అదనపు ఆదాయాన్ని ఇరవై శాతం సినీ కార్మికుల ఫెడరేషన్ కు ఇవ్వాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సినీ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే థియేటర్ లో డ్రగ్స్, నార్కోటిక్స్ కు సంబంధించి ప్రకటనలు జారీ చేయాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.


Tags:    

Similar News