హాలీవుడ్ క్రేజీ కపుల్ గా గుర్తింపు వున్న జంట బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ ల జంట. కాగా వారిద్దరూ దాంపత్య జీవితంలో వచ్చిన మనస్పర్థలు సమసిపోకపోవటంతో విడాకులు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరో పక్క బ్రాడ్ పిట్ ఇప్పటికే ఏంజలీనా జోలీ స్థానాన్ని మరో అగ్ర కథానాయిక రీప్లేస్ చేసుకున్నాడంట. ఈ విషయాలు చెప్పింది మరెవరో కాదు. బ్రాడ్ పిట్ కి గత కొన్ని సంవత్సరాలుగా సన్నిహితుడుగా ఉంటున్న ఆయన రక్షక భటుడు క్రిస్ హెర్జోగ్ కావటం గమనార్హం.
ఒక ప్రముఖ హాలీవుడ్ ఛానల్ బ్రాడ్ పిట్ వ్యక్తిగత జీవితం గురించి క్రిస్ హెర్జోగ్ ని వేసిన ప్రశ్నకు ఆయన అవసరమైన దానికి మించే వివరణ ఇచ్చాడు. "బ్రాడ్ పిట్ ఇప్పటికే మరొక ప్రముఖ హాలీవుడ్ నటితో సహజీవనం చేస్తున్నారు. బ్రాడ్ పిట్, ఏంజలీనా జంటకు గల ఆరుగురు సంతానంలో ఇద్దరు పిల్లలు బ్రాడ్ పిట్ ని తండ్రి అని పిలవటానికి కూడా ఇష్ట పడటం లేదు. ప్రస్తుతం బ్రాడ్ తో సన్నిహితంగా ఉంటున్న నాయిక కూడా ఏంజలీనా స్థాయి నటే. అయితే బ్రాడ్ పిట్ ఈ వ్యవహారం పై స్పందించే వరకు నేను ఆ నటి పేరు చెప్పలేను." అని బ్రాడ్ పిట్ రహస్య జీవితాన్ని బట్టబయలు చేసేసాడు క్రిస్ హెర్జోగ్.
క్రిస్ చేసిన వ్యాఖ్యలు అందరిని విస్మయానికి గురి చేస్తుండగా, బ్రాడ్ పిట్ మాత్రం ఏ వివరణ ఇవ్వకుండా ఈ విషయంలో మౌనం వహిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.