చిత్ర పరిశ్రమలో విశ్లేషకుల అభిప్రాయాలకు, ప్రేక్షకుల తీర్పుకు మధ్య వ్యత్యాసం ఎక్కువగానే ఉంటూవుంటుంది. విశ్లేషకులు సినిమా లోని అన్ని విభాగాల పని తీరుని పరిగణలోకి తీసుకుని వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంటారు. సగటు ప్రేక్షకుడు కేవలం కథనంలో కొత్తదనం, కాసేపు నవ్వించే సన్నివేశాలు, కవ్వించే పాటలు, ప్రత్యేక గీతాలు వంటి వాణిజ్య హంగులు ఆర్భాటాలు కోరుకుంటూ తెలిసిన కథనే మళ్లీ చెప్పినా కొన్ని సార్లు చిత్రాన్ని విజయ శిఖరంపై కూర్చోబెడుతుంటాడు. కాగా ఇటువంటి భిన్న అభిప్రాయమే ఇటీవల మలయాళంలో విడుదల ఐన మెగా స్టార్ మోహన్ లాల్ చిత్రానికి ఎదురు ఐయ్యింది.
మళయాళ నటులలో మోహన్ లాల్ ఆయన వయసుకి, నట సామర్ధ్యానికి సవాలుగా వుండే వైవిధ్య కథలలోని విభిన్న పాత్రలే ఎంచుకుంటూ వుంటారు. కానీ ఇటీవల విడుదల ఐన పులి మురుగన్ ఆయన శైలికి విరుద్ధమైన మాస్ మసాలా అంశాలతో నిండి వుంది. కానీ కేరళ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కూడా బాగా ఆదరిస్తున్నారు. మళయాళ చిత్ర విశ్లేషకురాలైన నిషా మీనన్ మాత్రం పులి మురుగన్ నాసి రకపు చిత్రం అని, మోహన్ లాల్ ఈ చిత్రం చెయ్యటం తనకు నమ్మశక్యంగా లేదు అని ఆవిడ విశ్లేషణలో పేర్కొన్నారు. విశ్లేషణతో పాటు ఆవిడ సామాజిక మాంద్యం ద్వారా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.
సామాజిక మాంద్యంలో ఆవిడకు అధిక సంఖ్యలోనే ఫాలోయర్స్ వున్నారు. పైగా ఎక్కువ మంది మోహన్ లాల్ అభిమానులు ఉన్నట్టున్నారు. వసూళ్ల వర్షం కురిపిస్తున్న పులి మురుగన్ చిత్రానికి వ్యతిరేక ప్రచారం చేస్తున్న నిషా మీనన్ ను చంపిస్తాము అని బెదిరిస్తూ కూడా కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే మొత్తం మీద నిషా మీనన్ అభిప్రాయానికి వ్యతిరేకంగా 4500 కామెంట్లు వచ్చాయి.