సారా దర్శనం ఇప్పట్లో లేనట్టే

Update: 2016-11-12 04:09 GMT

దక్షిణ భారతీయ చిత్రాలలో కన్నా హిందీ చిత్ర పరిశ్రమలో నట వారసుల పరంపర అధికంగా కొనసాగుతుంటుంది. అయితే వారు మరొక విషయంలో మనకన్నా ముందు వున్నారు. మన దగ్గర నటుల కుమారులు నటులుగా పరిచయం అవుతుండటం మాత్రమే చూస్తుంటాం. కానీ బాలీవుడ్ లో నటుల కూతుర్లు కూడా వెండి తెర పై హల్చల్ చేస్తుంటారు. సోనమ్ కపూర్, శ్రద్ద కపూర్, అలియా భట్, పరిణీతి చోప్రా లాంటి ఎందరో కథానాయికలు ఇలా సినీ నేపధ్యం వున్న కుటుంబాల నుంచి వచ్చిన వారే. గత కొంత కాలంగా ఈ జాబితాలోకి సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్ ల కుమార్తె సారా ఖాన్ చేరబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల రణ్వీర్ కి జోడిగా జోయా అక్తర్ దర్శకత్వంలో సారా ఖాన్ పరిచయ చిత్రం ఖాయం ఐయ్యింది అని కథనాలు వినిపించాయి. అయితే ఈ వార్తలు కేవలం పుకార్లు అని, సారా ఖాన్ పరిచయ చిత్రం పై వస్తున్న కథనాలు అన్ని వాస్తవ దూరం అని తేల్చి చెప్పేసారు సైఫ్ అలీ ఖాన్ సన్నిహితులు. జోయా అక్తర్ సోదరుడు నటుడు ఫర్హాన్ అక్తర్ సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్ లకు చిరకాల స్నేహితుడు అని, ఒక వేల వారి చిత్రంతో సారా వెండి తెర కు పరిచయం అవుతుంటే జోయా అక్తర్ స్వయంగా ఆ విషయం ప్రకటించే చనువు తీసుకోగలరని అభిప్రాయం పడుతున్నారు సైఫ్ సన్నిహితులు.

దీని బట్టి ఇక ఈ ఏడాదిలో సారా ఖాన్ తొలి చిత్రం చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి. అన్ని కుదిరితే 2017 లో సారా ఖాన్ తొలి చిత్రం వచ్చే అవకాశాలు వున్నాయి.

Similar News