సరిహద్దుల్లో సైనికుల కష్టం చూడమంటున్న వర్మ

Update: 2016-11-16 02:46 GMT

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సినిమా సెలెబ్రిటీలను కూడా తాకింది. ప్రముఖ సినిమా నటులు, దర్శకులు కమల్ హాసన్, రజని కాంత్, అక్కినేని నాగార్జున, ఐశ్వర్య రాయ్ బచ్చన్, పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, సిద్దార్థ్ వంటి ఎందరో అభినందించగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ వంటి వారు కూడా ఈ చర్య పై విమర్శలు గుప్పించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే తీసుకున్న నిర్ణయం ఉన్నతమైనది అయినప్పటికీ సామాన్యులను రోడ్ల మీదకి తీసుకు రావటం జీర్ణించుకోలేకపోతున్నాం అని తమ వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాయి అనేక పార్టీలు.

ఇటు వంటి విమర్శలన్నింటికీ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా తన దైన శైలిలో సమాధాన మిచ్చారు. సామాన్యుల కష్టాన్ని దేశ సరిహద్దులలో పోరాడే సైనికుల కష్టంతో పోల్చి విమర్శకుల నోర్లు మూయించే ప్రయత్నం చేసారు.

"కామన్ మాన్- మా దగ్గర నల్ల దానం లేనప్పటికీ మేము బ్యాంకుల వద్ద, ఎ.టీ.ఎం ల వద్ద పడిగాపులు ఖాయాల్సిన అవసరం మాకేంటి?

సైనికుడు- శత్రు దేశాలతో మాకు ఎటువంటి వ్యక్తిగత వైరం లేనప్పటికీ మీ కోసం వారు సంధించే బుల్లెట్లకు ఎదురు వెళ్లాల్సిన అవసరం మాకేంటి?" అని ట్వీట్ చేసి నరేంద్ర మోదీ నిర్ణయానికి తన తరపు నుంచి పూర్తి సహకారాన్ని అందించారు ఆర్.జీ.వి

Similar News