అక్కినేని నాగ చైతన్య కి తొలి విజయం రుచి చూపించిన చిత్రం ఏ మాయ చేసావే. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తోనే సమంత రుతు ప్రభు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఐయ్యింది. గౌతమ్ వాసుదేవ్ చిత్రాలకు విజయాపజయాలకు సంబంధం లేకుండా హీరోయిన్ పాత్రలకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంటుంది. ఘర్షణ లో ఆసిన్, సూర్య సొన్ ఆఫ్ కృష్ణన్ లో సమీరా రెడ్డి, ఏ మాయ చేసావే,ఎటో వెళ్లిపోయింది మనసు లలో సమంత లు కనిపించిన అంత అందంగా వారి ఇతర చిత్రాలలో కనిపించరు.
సమంత కు గౌతమ్ మీనన్ ప్రెసెంటేషన్ తోపాటు ఆయన సమంతకు సెలెక్ట్ చేసినా డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గొంతు బాగా కలిసి వచ్చింది. సమంత ముఖాన్ని, చిన్మయి గొంతును వేరు వేరుగా చూడటానికి ప్రేక్షకులకు చాలా కాలమే పట్టింది. ఇటీవల విడుదల ఐన గౌతమ్ మీనన్ నాగ చైతన్యల చిత్రం సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో పరిచయం ఐన మంజిమ మోహన్ కూడా షబ్బీ ఫేస్తో పాటు అధిభూతమైన నటనతో పాత్రలో లీనమైనప్పటికీ, ప్రేక్షకులు ఆ పాత్రకు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. దీనికి కారణం చిన్మయి డబ్బింగ్ సమంత కు సరిపోయినట్టుగా మంజిమ మోహన్ కు సరిపోకపోవటమే ఇందుకు కారణం అనే అభిప్రాయలు బలంగా వినపడుతున్నాయి.