ప్రస్తుతానికి సమంత తెలుగులో ఒక్క సినిమా కూడా చెయ్యడం లేదు. కేవలం తమిళం చిత్రాలు మాత్రమే చేస్తూ టాలీవుడ్ ని పక్కన పెట్టేసింది. కారణం మాత్రం నాగ చైతన్యతో పెళ్లి వల్లే సమంత తెలుగులో సినిమాలు ఒప్పుకోవడం లేదనే రూమర్స్ హల్ చల్ చేశాయి. ఇకపోతే సమంతానేమో తెలుగులో అర్ధవంతమైన పాత్రలు రాకపోవడం వల్లనే తెలుగు సినిమాలకి దూరమయ్యాననే అర్ధం వచ్చేలా మాట్లాడింది. మరి ఏది నిజమో సరిగ్గా తెలియదు గాని సమంత మాత్రం తెలుగు సినిమాలు ఒక్కటి సైన్ చెయ్యలేదు. కానీ తన సమయాన్ని నాగ చైతన్యతో గడపడానికి, వర్కౌట్స్ మీద పెట్టింది. కాబోయే భర్తతో ఎంత వీలయితే అంత టైం స్పెండ్ చేస్తుంది. ఇక మరోపక్క తాను ఫిట్ నెస్ మీద కూడా పూర్తి దృష్టి సారించింది సమంత. ఈ మధ్యన సమంత జిమ్ లో వరౌట్స్ చేస్తున్న వీడియోస్ యు ట్యూబ్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పడు కూడా సమంత జిమ్ లో 75 కేజీల బరువు ఎత్తుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అబ్బాయిలు సైతం అలోచించి బరువులెత్తుతారు. కానీ సమంత మాత్రం బలే సులువుగా ఎత్తేసింది. ఇక ఈ వీడియో ని సమంతానే సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి సమంత అబ్బాయిలకి ఏమాత్రం తీసిపోకుండా జిమ్ లో వర్కౌట్స్ చేసేస్తుంది.