సప్తగిరికి పవన్ కల్యాణ్ రుణం తీర్చుకున్న వేళ

Update: 2016-11-07 05:36 GMT

స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ సినిమా ద్వారా కమెడియన్ సప్తగిరి హీరో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియో వేడుకకి పవన్ కళ్యాణ్ ని ముఖ్య అథిదిగా గా పిలిచారు ఆ చిత్ర నిర్మాతలు, సప్తగిరి. మరి పవన్ కళ్యామ్ ఏదో రేర్ గా తప్పితే అంతగా ఆడియో ఫంక్షన్లకు వెళ్ళడం అస్సలు ఇష్టముండదు. ఇక సప్తగిరి వంటి వారి ఫంక్షన్లకు అంటే అస్సలు సమస్యే లేదు అనుకో. అలాంటిది సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియోకి పవన్ రావడం అంటేనే ఓ పెద్ద ట్విస్ట్. అది అందరూ ఆశ్చర్యపోయేంత రీతిలో పవన్ సప్తగిరి ఆడియో కి విచ్చేశాడు.

అసలు పవన్ చిన్న కమెడియన్ కమ్ హీరో సినిమాకి ఆడియో కి హాజరవుతారని ఎవరు అనుకోలేదు. పవన్ కళ్యాణ్ ఆడియో మొదలయ్యేంతవరకు ఈ విషయం ఆలోచిస్తూనే వున్నారు సినీ జనాలు. కానీ పవన్ స్పీచ్ లో ఆ విషయం విన్నాక ఓ అందుకా పవన్ వచ్చిందీ అంటూ గమ్మత్తుగా ఫీలయ్యారు. విషయం ఏంటంటే... స‌ప్త‌గిరికి ప‌వ‌న్ చేసిన సాయం అంతా ఇంతా కాదట. మాటల్లో చెప్పలేనంత. చేతల్లో చూపలేనంత. ఏంటంటే.. ప‌వ‌న్ తాజాగా ‘కాట‌మ‌రాయుడు’ అని ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ స‌ప్త‌గిరి సినిమాకి పెట్టుకోవాలనుకున్న పేరంట. కానీ ప‌వ‌న్ కి ఆ టైటిల్ అంటే మోజు ఏర్పడటంతో.. ఆ టైటిల్ తనకు కావాలనుకున్నాడంట. అంతే స‌ప్త‌గిరి పవన్ పై ఉన్న ఎంతో అభిమానంతో త‌న సినిమాకి ‘స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌’ అని పేరుపెట్టుకొని ఆ కాటమరాయుడు పవన్ కి ఇచ్చేశాడంట. అదీ విషయం. ఇప్పుడర్థమైందిగా పవన్ ఇంతగా ఎందుకొచ్చాడనేది.

అలా పవన్ ఈ చిత్రం టైటిల్ రుణం ఇలా తీర్చేసుకున్నాడన్న మాట. నిజానికి ప‌వ‌న్ కళ్యాణం రావడంతోటే ఆ ఆడియో ఫంక్షన్ కి కల వచ్చేసింది. ప‌వ‌న్ రావ‌డ‌మే కాకుండా.. స‌ప్త‌గిరిని మ‌న‌స్ఫూర్తిగా ఆశీర్వ‌దించాడు కూడానూ. గబ్బర్‌సింగ్’ మూవీలో సప్తగిరి ఓ సీన్ చేశాడని, అందులో తాము కలిసి నటించలేదు గానీ బాగా చేశాడని కితాబిచ్చాడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. అప్పటినుంచీ సప్తగిరిని కలవాలనుకుంటున్నానని, ఇప్పటికి కుదిరిందని అన్నాడు. ‘నా మీద అతనికి ఉన్న ప్రేమే ఇక్కడికి రప్పించింది’ అని పేర్కొన్నాడు.

ఇంకా పవన్ మాట్లాడుతూ.. ‘టైటిల్ అడిగినందుకు నాకే సిగ్గుగా అనిపించింది. అయినా.. అడిగిన వెంట‌నే ఇచ్చినందుకు స‌ప్త‌గిరికి కృత‌జ్ఞ‌త‌లు’ అని త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు ప‌వ‌న్‌. ఇంకా పవన్ మాట్లాడుతూ.. తాను ఎక్కువగా సినిమాలు చూడ‌న‌ని, అయితే స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ సినిమా మాత్రం చూడాల‌నుకుంటున్నానని, అందుకని ఈ సినిమా విడుద‌ల‌కు ముందు ప్ర‌త్యేకంగా ఓ షో వేసుకొని ఈ చిత్రం చూస్తాన‌ని చెప్పాడు పవన్.

Similar News