సక్సెస్‌తో వీడ్కోలు పలకాలని కీర్తి ఆశ

Update: 2016-12-01 16:35 GMT

2016 సంవత్సరానికి తెలుగు చిత్రాలలో తొలి సక్సెస్ ఇచ్చిన చిత్రం నేను శైలజ. ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా పరిచయమయ్యింది. పరిచయ చిత్రం, పైగా ఈ ఏడాదికి తెలుగులో తొలి చిత్రం ఐన నేను శైలజ తో బాహారీ విజయాన్నే నమోదు చేసింది కీర్తి సురేష్. ఈ చిత్రం తరువాత అనూహ్యంగా కొద్దిగా విరామం వచ్చినప్పటికీ ప్రస్తుతం చేతి నిండా అవకాశాలతో బిజీగా వుంది కీర్తి సురేష్. పలు స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్ట్స్ లోనూ కథానాయిక అవకాశం దక్కించుకుంది ఈ మద్రాస్ నాచురల్ బ్యూటీ.

నేను శైలజ తరువాత కీర్తి సురేష్ నటించిన మరే స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు ఇప్పటి వరకు విడుదల కాలేదు. కానీ కీర్తి సురేష్ తమిళంలో ధనుష్ సరసన తొడరి చిత్రంలో నటించగా ఆ చిత్రం ధనుష్ కు తెలుగు లో వున్న మార్కెట్‌తో రైల్ పేరు మీద అనువాదమయ్యింది. ఆ చిత్రం నష్టాలను మిగిల్చింది. తమిళంలో విజయం పొందిన కీర్తి సురేష్ ఇటీవల చిత్రం రెమో కథానాయకుడు తెలుగు వారికి పరిచయం లేనప్పటికీ మరో విజయం కోసం ఉవ్విళ్ళూరుతున్న కీర్తి సురేష్ స్వయంగా దిల్ రాజు కు రెమో చిత్ర అనువాద హక్కులు ఇప్పించింది. తమిళ ప్రేక్షకుల అభిరుచులు తెలుగు ప్రేక్షకుల అభిరుచులు వేరు వేరు అని మరోసారి చాటి చెప్పింది తెలుగు రెమో ఫలితం.

ఇక అనువాద చిత్రాల సంగతి పక్కన పెట్టి వరుస విజయాలతో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ నటించిన నేను లోకల్ చిత్రం ఈ నెల 23 న విడుదలకు సిద్దమవుతుండటంతో నేను లోకల్ పై ఆశలు పెంచుకుంది కీర్తి సురేష్. ఈ ఏడాదికి ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రం సక్సెస్‌తో స్వాగతం పలికినట్లుగా మరో స్ట్రెయిట్ తెలుగు చిత్ర సక్సెస్‌తో వీడ్కోలు పలకాలని ఆరాటపడుతోంది కీర్తి సురేష్. మరి ఈ భామ ఆశ నెరవేరుతుందో లేదో మరో మూడు వారాలలో తేలిపోనుంది.

Similar News