సంక్రాంతి వార్ వారిద్దరి మధ్యే!!

Update: 2016-10-31 11:09 GMT

సంక్రాంతికి తమ తమ సినిమాలతో సందడి చెయ్యడానికి సీనియర్ స్టార్ హీరోలు నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్ రెడీ అయ్యారు. ప్రతి సంక్రాంతికి కోడి పందేలకు ఎంత క్రేజ్ వుందో... ఆ సమయం లో విడుదలయ్యే సినిమాలకి అంతే క్రేజ్ ఉంటుంది. కోడిపందేలతో కుర్రకారు చెలరేగిపోయినట్లే.... తమ తమ హీరోల సినిమాలకు అటువంటి హంగామానే సృస్తిస్తారు ఫ్యాన్స్. ఇక స్టార్ హీరోస్ అయిన చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా సంక్రాంతికి విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించాడు. ఇక బాలకృష్ణ తన 100 వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ని కూడా వచ్చే సంక్రాంతికి విడుదల చెయ్యడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక నాగార్జున హాథిరామ్ బాబాగా నటిస్తున్న 'ఓం నమో వెంకటేశాయ' ని కూడా సంక్రాంతి బరిలో నిలపాలని రాఘవేంద్రుడు అనుకున్నాడు. ఇక మరో సీనియర్ హీరో వెంకటేష్ తన 'గురు' చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చెయ్యాలనుకున్నాడు. కొన్ని కారణాల వల్ల అది కాస్తా సంక్రాంతి కి విడుదల చెయ్యడానికి ఏర్పాటు చేసుకుంటున్నాడు.

అయితే ఒకేసారి పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే ఒక పక్క థియేటర్స్ సమస్య ఏర్పడడం తో పాటు కలెక్షన్స్ పరం గా కూడా పెద్ద డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక బాలకృష్ణకి తన కెరీర్ లో 100 వ చిత్రం 'గౌతమి..' ఎంతో ఇంపార్టెంట్ గనక ఖచ్చితం గా సంక్రాంతికి వచ్చి బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టాలని నిర్ణయం తీసేసుకున్నాడు. ఇక చిరు తన కెరీర్ కి 150 వ సినిమా అనేది ఒక మైలు రాయి. అందుకే తన 150 చిత్రం 'ఖైదీ నెంబర్ 150' ని కూడా సంక్రాతి బరిలో దింపి క్యాష్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. మరి వీరికి తమ కెరీర్ లో ఈ రెండు చిత్రాలు ఎంతో ఇంపార్టెంట్ గనక వీరికి పోటీగా వెళ్లి వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రాఘవేంద్రుడు తన 'ఓం నమో వెంకటేశాయ' చిత్రాన్ని సంక్రాంతి తర్వాత కొన్ని రోజుల గ్యాప్ తో విడుదల చెయ్యాలని అనుకుంటున్నట్లు సమాచారం. అంటే నాగ్ పొంగల్ రేస్ నుండి తప్పుకున్నట్లే. ఇక వెంకీ కూడా 'గురు' తో సంక్రాతి కి ముందు గాని వెనుక గాని రావడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

ఇక ఈ పొంగల్ రేస్ కేవలం చిరు .బాలయ్య మధ్యలోనే వుండబోతుందన్నమాట. ఇక ఈ రెండు సినిమాలతో వీరు తమ ల్యాండ్ మార్క్ ని చేరుకోబోతున్నారు కూడా..! ఇక కోడి పందేలతో పాటు నందమూరి, మెగా ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల సినిమాలతో సంక్రాతి ని సెలెబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు.

Similar News