నందమూరి బాల కృష్ణ 100 వ చిత్రం పైగా , చరిత్ర మీద ఆసక్తి ఉన్న వారికి తప్ప ఎక్కువగా పాప్యులారిటీ లేని శాతకర్ణి జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ కావటంతో తొలి నుంచి అంచనాలు భారీగానే వున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్దపీట వేస్తుండటంతో ప్రేక్షకులలో కొంత మంది బాహుబలి చిత్రంతో పోలికలు కూడా పెట్టుకుంటున్నారు. దర్శకుడు క్రిష్ మాత్రం చిత్ర బృందం అంతా కథ ని నమ్మి ప్రయాణం చేస్తున్నాం అని, కథ ఏది అడిగితే అది సమకూరుస్తూ చిత్రం సిద్ధం చేస్తున్నామని మరే ఇతర చిత్రాలతో పోల్చి గౌతమీ పుత్ర శాతకర్ణి ని చూడవద్దు అని ఒక ఇంటర్వ్యూ లో విజ్ఞప్తి చేసుకున్నాడు.
బాహుబలి చిత్రంతో పోల్చుకోవటానికి మరొక కారణం ట్రైలర్ విడుదలకి జరిగిన ప్రచారం. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 9 న యూరప్ లో పలు దేశాలతో సహా తెలుగు రాష్ట్రాల్లో 100 థియేటర్ల లో ట్రైలర్ ను విడుదల చెయ్యాలని ప్రణాళిక వేశారు నిర్మాతలు. ఇప్పటి వరకు కేవలం బాహుబలి చిత్రానికి ఈ తరహాలో ట్రైలర్ విడుదల జరిగింది. గౌతమీ పుత్ర శాతకర్ణి కి ముందు నుంచి రచించిన వ్యూహం అంతా బెడిసికొట్టినట్లు తెలుస్తుంది. ఎప్పటిలానే, అన్ని చిత్రాల ఆడియో ఆవిష్కరణల మాదిరిగానే ఆడియో విడుదల వేదిక పైనే ట్రైలర్ విడుదల జరగనుంది. డిసెంబర్ 16 న తిరుపతిలో గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో వేడుక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ల సమక్షంలో భారీ వేడుకగా జరగనుంది తప్ప ప్రత్యేక ట్రైలర్ విడుదల ఏమి జరగదు అని స్పష్టత వచ్చేసింది.