వైఫల్యం నుంచి బైటపడుతూ, సీనియర్ కమెడియన్ కి చేయూత?

Update: 2016-11-26 07:55 GMT

2014 ఆగడు చిత్రం విడుదల వరకు శ్రీను వైట్ల టాలీవుడ్ లో మోస్ట్ రెపుటేడ్ డైరెక్టర్. కానీ ఆ చిత్ర వైఫల్యం చెందటంతో నిర్మాతలు 14 రీల్స్ వారు, సూపర్ స్టార్ మహేష్ బాబు కంగుతినప్పటికీ ఆ చిత్ర ఫలితం తాలూకా చేదు జ్ఞాపకాలను ఎక్కువ కాలం మోసింది మాత్రం దర్శకుడు శ్రీను వైట్లనే. గత ఏడాది మెగా స్టార్ చిరంజీవి అతిధి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కథానాయకుడిగా బ్రూస్ లీ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీను వైట్ల ఆ చిత్రంతోనూ చేదు జ్ఞాపకాలనే మూట కట్టుకోవాల్సి వచ్చింది. పైగా అదే సమయంలో అతని వ్యక్తిగత జీవితంకూడా బాగా అలజడులకు గురి కావటంతో తదుపరి చిత్రం మిస్టర్ పట్టాలెక్కించటానికి గ్యాప్ తీసుకుని సన్నద్ధమయ్యారు శ్రీను వైట్ల. ఈయనకి మిస్టర్ విజయం చాలా కీలకం కానుంది.

మరో పక్క సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం పరిస్థితి ఇలానే వుంది. ఆయన చిత్ర పరిశ్రమలో నట జీవితం ప్రారంభించిన తరుణంలో దర్శక రచయిత జంధ్యాల, ఈ.వి.వి.సత్యనారాయణ వంటి వారు అద్భుతమైన హాస్య పాత్రలను పైగా వారు ప్రతి చిత్రాలలో పూర్తి నిడివి వున్నా పాత్రలు ఇవ్వటంతో బ్రహ్మానందం దూసుకు వెళ్లిపోవటమే కాక నిన్న మొన్నటి వరకు నేటి తరం యువ హాస్య నటులతో పోటాపోటీగా నిలిచారు. ఈ తరంలో బ్రహ్మికి ఆ సీజ్ రావటానికి దర్శక రచయిత త్రివిక్రమ్, శ్రీను వైట్లల చిత్రాలే కారణం. కానీ ఇప్పుడు బ్రహ్మి హాస్యం మూస ధోరిణిలోకి వెళ్ళిపోవటం, ఇతర హాస్య నటులు జోరు మీద ఉండటంతో దర్శక రచయితలు బ్రహ్మికి పాత్రలు రాయటం మానేశారు. శ్రీను వైట్ల మాత్రం మిస్టర్ సినిమాలో బ్రహ్మికి ఎప్పటిలానే పాత్ర రూపొందించారు.

ఒక పక్క దర్శకుడిగా శ్రీను వైట్లకి మిస్టర్ సక్సెస్ ఎంత అవసరమో, మరో పక్క బ్రహ్మానందం కి కూడా అంతే అవసరం. మరి శ్రీను వైట్ల ఈదుతున్న సముద్రం నుంచి తాను ఒడ్డుకి సురక్షితంగా చేరుతూ బ్రహ్మీని కూడా సురక్షితంగా చేర్చుతాడో లేదో మరో నాలుగు నెలల్లో తెలియనుంది.

Similar News