సినిమా విడుదల అయిన తర్వాత.. కలెక్షన్లు కొంచెం అటు ఇటుగా ఉంటే అదనంగా కొన్ని సీన్లు కలపడం, కొంత కామెడీ ట్రాక్ కలపడం, ఒక పాట కలపడం .. ఆయా సినిమా జోనర్ ను బట్టి ఏదోటి కలపడం అనేది కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న టెక్నిక్కే. అయితే.. తాజాగా థియేటర్లలో ఆడుతున్న నందిని నర్సింగ్ హోం చిత్రానికి కూడా ఇలాంటి బంపర్ ఆఫర్ ఒకటి ఇస్తున్నారు.
నరేష్ కొడుకు నవీన్ విజయకృష్ణ హీరోగా గిరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. విడుదలైందో లేదో అప్పుడే విజయ యాత్ర కూడా మొదలెట్టేసింది. అయితే విజయయాత్రల సందర్భంగా దర్శకుడు గిరి ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ‘‘ఈ చిత్రంలో కామెడీని అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఫీలవుతున్న ఆయన.. కామెడీకి అదనంగా మరో రెండు సీన్లు కూడా కలపబోతున్నామని వెల్లడించారు. వెన్నెల కిషోర్ తో షూట్ చేసిన సీన్లు రెండున్నాయని.. వాటిని కలుపుతున్నాం అని చెప్పుకొచ్చారు. అంటే వెన్నెల కిషోర్ సీన్లకోసం.. సినిమ చూసిన వాళ్లు మళ్లీ వచ్చి సినిమా చూడాలని దర్శకుడు కోరుకుంటున్నారో ఏంటో మనకు అర్థం కాని సంగతి.
అయినా సినిమా టాక్ గొప్పగా ఏమీ లేదు. ఇలాంటి సమయంలో వెన్నెల కిషోర్ సీన్లు యాడ్ చేస్తున్నామంటే.. ఆయన అంత క్రేజీ నటుడా అని జనం అనుకుంటున్నారు.