వినాయక్ కు మెమొరబుల్ గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్!

Update: 2016-10-09 14:57 GMT

దర్శకుడు వినాయక్ ఇవాళ (అక్టోబరు 9)న పుట్టినరోజు జరుపుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఉన్న స్టార్ దర్శకుల్లో ఒకరు అయిన వివి వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా మిత్రులు, పలువురు సినిమా నిర్మాతలు, పరిశ్రమలోని ఆయన సన్నిహితులు అందరూ ఇంటికి వచ్చి బొకేలు అందించి.. శుభాకాంక్షలు తెలియజేశారు. ఆప్తులందరి మధ్యలో వినాయక్ కేక్ కట్ చేసి పుట్టిన రోజు జరుపుకున్నారు.

అయితే వినాయక్ వద్దకు వచ్చిన అతిథుల్లో గుసగుసగా వినిపిస్తున్న సంగతి ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి , తన దర్శకుడు వివి వినాయక్ కు చాలా మెమొరబుల్ గిఫ్ట్ ఇచ్చారుట. సాధారణంగా తాను పనిచేసే టెక్నీషియన్లుకు తిరుగులేని మంచి కానుకలు ఇవ్వడం ద్వారా వారి అభిమానాన్ని సంపాదించుకోవడం చిరంజీవికి అలవాటు. పైగా ఆ విషయాల్ని ఆయన గోప్యంగా ఉంచుకుంటారు కూడా. అలాంటిది తనకు ఠాగూర్ వంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన వినాయక్ ను విస్మరిస్తారా? పైగా ఇప్పుడు తాను వండర్స్ చేయాలని అనుకుంటున్న 150 చిత్రం ’ఖైదీ నెంబర్ 150‘కు కూడా దర్శకుడు వినాయక్ మరి. అందుకే తన దర్శకుడిని ఎప్పటికీ గుర్తుండేలా ఇంప్రెస్ మంచి గిఫ్ట్ ను మెగాస్టార్ పంపారని అంతా అనుకుంటున్నారు.

Similar News