విదేశాలలోని ముహూర్తం తప్పకూడదు అంటున్న బాలయ్య

Update: 2016-10-27 16:52 GMT

గత ఎడాది విడుదల ఐన బాహుబలి చిత్రం సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేక చెప్పే అవసరం ఉండదు. అయితే కథ కథనాల్లో, పాత్రల వీరోచితంలో, విజవల్ ఎఫెక్ట్స్ లాంటి వాటి ప్రమేయం వున్నా సాధారణ చిత్రానికి ఆ స్థాయి వసూళ్లు వచ్చే అవకాశమే లేదు. నిర్మాతలు ఆ చిత్రానికి నిర్మాణ విలువల విషయంలో రాజీపడకపోవటమే కాకుండా ప్రచారం విషయంలోనూ కొత్త పంథా ఎంచుకుని ఆ దారిలో ప్రొమోషన్స్ చేసి ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి పేరు వినిపించేలా, యావత్ సినీ జనం బాహుబలి విడుదల కోసం నిరీక్షించేలా చేసారు.

ఆర్కా మీడియా వాళ్ళు చేసిన కొత్త శైలి ప్రచారంలో ప్రచార చిత్రాన్ని థియేటర్లలో విడుదల చెయ్యటం భారీ సంచలనం. ఇప్పుడు అదే విధంగా తమ చిత్రపు థియేట్రికల్ ట్రైలర్ ని కూడా థియేటర్లు బుక్ చేసి అభిమానులను పిలిచి విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తుంది గౌతమీ పుత్ర శాతకర్ణి బృందం. నందమూరి బాల క్రిష్ణ థియేట్రికల్ ట్రైలర్ విడుదల ముహుర్తాన్ని కూడా చూసారు అని సమాచారం. డిసెంబర్ నెల లో ముందుగా ప్రచార చిత్రం విడుదల చేసి తరువాత అదే నెలలో పాటల విడుదల వేడుక చేయన్నునారు.

బాహుబలి కంటే ఒక అడుగు ముందే వుంది గౌతమీ పుత్ర శాతకర్ణి. బాహుబలి ట్రైలర్ విడుదల కేవలం తెలుగు రాష్ట్రాల లోని కొన్ని థియేటర్లకే పరిమితం కాగా, గౌతమీ పుత్ర శాతకర్ణి ట్రైలర్ ని విదేశాలలోని తెలుగు వారి కోసం ఇదే పద్దతిలో విడుదల చేస్తున్నారంట. విదేశాలలో కూడా ముహూర్తం తప్పకూడదు అని బాలయ్య ఆదేశాలు జారీ చేసారంట.

Similar News