‘వంగవీటి’ ఆడియో అంటే బెజవాడ వణుకుతోంది

Update: 2016-11-29 12:00 GMT

సంచలనాత్మక దర్శకుడు, వివాదాస్పద వ్యక్తి రామ్ గోపాల్ వర్మ విజయవాడ నగర కుల రాజకీయాలు, ఆధిపత్య పోరుల నేపథ్యంలో తెరకెక్కించిన కథ వంగవీటి. అయితే ఈ కథ నేపధ్యం నేటిది కాదు. రామ్ గోపాల్ వర్మ విజయవాడ లో ఇంజనీరింగ్ చదువుతున్న 80 దశకాల నాటిది. ఈ చిత్రం పోస్టర్లు, ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులలో ఆసక్తిని రెట్టింపు చేయగా తాజాగా రామ్ గోపాల్ వర్మ వెల్లడించిన తన సరికొత్త నిర్ణయం మళ్లీ వంగవీటి చిత్రంపై చర్చకు దారి తీసింది. విజయవాడ నగరంలో వంగవీటి విడుదల సమయానికి అల్లర్లు, ఘర్షణలు చెలరేగే అవకాశాలు ఉన్నాయని పలు అభిప్రాయలు వ్యక్తం అవుతున్న తరుణంలో వంగవీటి చిత్ర ఆడియో వేడుక మరో సంచలనాత్మక నిర్ణయం ఐయ్యింది.

రామ్ గోపాల్ వర్మ వంగవీటి చిత్ర ఆడియో ను విజయవాడ లోని కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఆవిష్కరించటానికి నిశ్చయించుకున్నారు. ఈ చిత్ర ఆడియో వేడుక విజయవాడలో డిసెంబర్ 3 న జరగనుంది అని రామ్ గోపాల్ వర్మ స్వయంగా వెల్లడించారు. డిసెంబర్ 23 న విడుదల కానున్న వంగవీటి చిత్రంపై ఇప్పటికే అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. ఈ తరుణంలో ఆర్.జి.వి కొందరు ప్రముఖ నేతల సమక్షంలో తన చిత్ర ఆడియో ఆవిష్కరణ జరగనుంది అని తెలపటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించటానికి పోలీస్ శాఖ వారిపై అదనపు భారం పడింది.అంటే

Similar News