రెజీనా చెప్పిన సీక్రెట్ : రానా మరో చారిత్రాత్మక చిత్రం

Update: 2016-10-17 16:15 GMT

బాహుబలి చిత్రంతో బల్లాల దేవుడి గా ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసిన దగ్గుబాటి రానా, ప్రస్తుతం బాహుబలి 2 చిత్రీకరణలో వున్నాడు. ఈ చిత్రంతో పాటు కొన్ని వైవిధ్య చిత్రాలలో కనిపించబోతున్నాడు రానా. వాటిల్లో ఘాజి అనే హిందీ చిత్రం ఒకటి. ఇది కాక మరో పీరియాడిక్ చిత్రంలో రానా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడుట. అయితే ఆ వివరాలు రానా కన్నా ముందుగా రెజినా వెల్లడించటం విశేషం. కారణాల్లోకి తొంగి చూస్తే అదే చిత్రంలో రానా కి భార్యగా కనిపించనుంది ఈ మద్రాస్ పిల్ల. అందుకే చనువు తీసుకుని రానా కన్నా ముందే ఆ పాత్ర వివరాలు బైట పెట్టేసింది.

1945 కాలం నాటి కథా నేపథ్యంలో తెరకెక్కబోయే చిత్రంలో నాటి స్వాతంత్ర సాధన కోసం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ బృందంలోని సభ్యుడి పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నాడు అంట. ఆ చిత్రంలో రానా ని వివాహం చేసుకునే చెట్టియార్ అమ్మాయి పాత్రలో రెజినా కనిపించనుంది అట. ఈ పాత్రలో రెజినా అతి తక్కువ మేకప్ తో సహజత్వంగా చీర కట్టులో వుండబోతోంది అంట. ఈ చిత్ర దర్శక నిర్మాతల వివరాలు, చిత్రీకరణ వివరాలు ఏమి ఇంకా వెల్లడించలేదు.

ఈ చిత్రాలు కాకుండా బాహుబలి తర్వాత రానా దగ్గుబాటి వారి సొంత సంస్థ ఐన సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించబోయే చిత్రంలో నటిస్తారు. ఈ చిత్రానికి తేజ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు.

Similar News