రికార్డు స్థాయిలో 4వ ప్లేస్ కొట్టేసింది

Update: 2016-11-07 10:24 GMT

జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1 న విడుదలై కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇంత విజయం సాధించిన ఈ జనతా గ్యారేజ్ చిత్రాన్ని 50 రోజులు పూర్తవ్వగానే మాటీవీ వారు తమ ఛానెల్ ప్రదర్శించేసారు. ఇక ఇది బాక్సాఫీస్ ని షేక్ చేసిన మాదిరిగానే టీవీలో కూడా ప్రభంజనం సృష్టించిందని చెబుతున్నారు. దీపావళి ముందు వారం ప్రదర్శించబడింది ఈ జనతా గ్యారేజ్ చిత్రం. ఇక టీవీలో ఎన్టీఆర్ సినిమా అంటే మామూలుమాట కాదు. జనాలు టీవీలకు అతుక్కుపోయి మరీ ఈ సినిమాని వీక్షించారని చెబుతున్నారు. ఇక ఈ ఏడాది టీఆర్పీరేటింగ్లో ఈ సినిమా ప్రదర్శినబడినప్పుడు మాటీవీ కి 20.69 పాయింట్ల రేటింగ్ తో దూసుకెళ్లిందని చెబుతున్నారు. ఇదంతా ఎన్టీఆర్ ఇమేజ్ కి ప్రతీకగా చెబుతున్నారు.

ఇక ఇప్పటివరకు టీవీలో ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ లో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తో ఉన్న సినిమాలు. మొదటి ప్లేస్ లో రామ్ చరణ్ మటించిన మగధీర 22 పాయింట్స్ తో ఉండగా, రెండో ప్లేస్ లో ప్రభాస్ బాహుబలి 21.84 రేటింగ్తో ఉండగా, మహేష్ శ్రీమంతుడు- 21.24, ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ - 20.69 పాయింట్లు సాధించినట్టు చెబుతున్నారు. అంటే ఎన్టీఆర్ సినిమా టాప్ 4 లో వున్నదన్నమాట. అయితే ఎన్టీఆర్ సినిమాకి కొంచెం తక్కువ రేటింగ్ రావడానికి అజ్ఞాత శత్రువెవరో జనతా గ్యారేజ్ సినిమా పైరసీ ని యూట్యూబ్ లో పెట్టినట్లు వార్తలొచ్చాయి. దీని కారణంగానే టీఆర్పీ రేటింగ్స్ లో ఎన్టీఆర్ చిత్రం వెనుకబడ్డట్లు వార్తలొచ్చాయి.

Similar News