రామ్ చరణ్ ధ్రువ చిత్రానికి పబ్లిసిటీ బాగా పెంచేశారు. ఏదో ఆడియో ని కామ్ గా మార్కెట్ లోకి వదిలేసినా... వీడియో సాంగ్స్ బిట్స్ ని వదులుతూ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తున్నారు. ధ్రువ సాంగ్ మేకింగ్స్ ని ఒక్కొక్కటిగా వదులుతూ సినిమా పై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక నిన్నటికి నిన్న చూసా.. చూసా సాంగ్ మేకింగ్ ని విడుదల చేసిన ధ్రువ చిత్ర యూనిట్ ఇప్పుడు తాజాగా నీతోనే... డాన్స్ సాంగ్ మేకింగ్ వీడియో ని విడుదల చేసింది.
నీతోనే... డాన్స్ సాంగ్ మేకింగ్ లో మెగా ఫ్యామిలీ సందడి చేశారు. రామ్ చరణ్ స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తూ సందడి చేసాడు. ఇక వీడియో మేకింగ్ లో రామ్ చరణ్ తన భార్య తో బాగా ఎంజాయ్ చేసాడు. భార్య ఉపాసనతో కలిసి ధ్రువ సాంగ్స్ సెట్ లో కూల్ గా కనిపించాడు. ఇక అలాగే తన తండ్రి చిరంజీవితో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు రామ్ చరణ్ కనిపించగా... రకుల్ డాన్స్ స్టెప్స్ తో చంపేసింది. ఇక రామ్ చరణ్ మామ అల్లు అరవింద్ ఈ సినిమా కి ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి మెరిశాడు అనుకోవచ్చు. కానీ అల్లు అరవింద్ కొడుకులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు కూడా ధ్రువ సాంగ్ మేకింగ్ వీడియో లో రచ్చ రచ్చ చేశారు. రామ్ చరణ్ తన తండ్రి సినిమా ఖైదీ నెంబర్ 150 ని ప్రొడ్యూస్ చేస్తూనే మరో పక్క ధ్రువ సినిమా చేసాడు. ఇక ఈ ధ్రువ సినిమాలో మెగా ఫ్యామిలీ అంతా షూటింగ్ స్పాట్ లో రామ్ చరణ్ ని బాగా ఎంకరేజ్ చేశారని ఈ మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది.
ఇక ఈ మేకింగ్ వీడియోస్ చూస్తుంటే సినిమా మీద ఉన్న అనుమానాలన్నీ పటాపంచలై పోవాలనే ఉద్దేశ్యం తోనే బాగా ప్లాన్ చేసి రామ్ చరణ్, డైరెక్టర్ సురేంద్రరెడ్డి ఈ వీడియోస్ ని వదిలారని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై అనేక రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. రామ్ చరణ్ - సురేంద్ర రెడ్డి గొడవ పడ్డారని.... సాంగ్స్ విషయం లో చరణ్ హ్యాపీగా లేడని అబ్బో ఒకటేమిటి చాల గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. ఇక సాంగ్ మేకింగ్స్ చూస్తే మాత్రం ఇప్పటిదాకా ఉన్న అనుమానాలు పోయి సినిమా పై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా వుంది. సో చరణ్ బాగా తెలివిగా ఆలోచించి ఇలా పబ్లిసిటీ మొదలు పెట్టాడని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.