రాజమౌళి ఇంటరెస్టింగ్‌గా ఏదోటి రిలీజ్ చేయాల్సిందే!

Update: 2016-10-19 07:19 GMT

బాహుబలి-1 సినిమా అనూహ్యమైన హిట్ సాధించిందంటే.. దానికి చాలా కారణాలున్నాయి. సినిమాలోని ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ గురించి రాజమౌళి... ఆసక్తికరమైన అంశాలు రరకాల రూపాల్లో వెల్లడిస్తూ జనంలో ఆ ఇంటరెస్ట్ ను కలిగించారు. ఇప్పుడు బాహుబలి 2 కు సంబంధించి కూడా అలాంటి ఆసక్తికరమైన అంశం ఏదైనా వెల్లడి చేయాల్సిన సమయం వచ్చేసిందని ప్రస్తుతం అభిమానులు కోరుకుంటున్నారు.

తెలుగు సినిమా చరిత్రలో కొత్త అధ్యాయంగా నిలిచింది బాహుబలి ది బిగినింగ్. టాలీవుడ్ దర్శకుల సత్తాను ప్రపంచానికి చాటింది. ఇప్పుడు అదే జోరులో వచ్చే ఏడాది ప్రేక్షకులకు విందు చేసేందుకు ముస్తాబవుతోంది బాహుబలి 2. దీనికి సంబంధించి ప్రభాస్ పుట్టిన రోజుకు ఒక రోజు ముందు.. ఈనెల 22న ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కానుంది..వీటితోపాటూ 360డిగ్రీ మేకింగ్ వీడియో, వర్చువల్ రియాలిటీ ప్రోమో, గ్రాఫిక్ నావెల్ ప్రివ్యూ రిలీజవుతాయి. ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్ ఒక్కసారిగా ఊపందుకుంటాయి.. కానీ అప్పటికి కథ గురించి తెలీదు కాబట్టి.. బాహుబలి ఫస్ట్ పార్ట్ కు ప్రమోషన్స్ తో ఫస్ట్ డే నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది బాహుబలి టీమ్. ఫస్ట్ పోస్టర్ నుంచీ.. థిరటికల్ ట్రైలర్ రిలీజయ్యేవరకూ ప్రేక్షకుల్లో ఉత్కంఠ కంటిన్యూ చేసింది. చేతిలో పసిబిడ్డ పోస్టర్ నుంచి.. ప్రభాస్ శివలింగం ఎత్తుకున్న పోస్టర్, రానా, తమన్నా, అనుష్క, కట్టప్ప కాలకేయ పోస్టర్ వరకూ ప్రతి క్యారెక్టర్ నూ జనాల్లోకి తీసుకెళ్లగలిగారు. థిరటికల్ ట్రైలర్ తో సినిమాకు ఒక క్రేజ్ తీసుకొచ్చేశారు. బాహుబలి ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తే దానికి అంత క్రేజ్ తీసుకొచ్చింది..

కానీ ఇప్పుడు సినిమా సగం కథ రివీలైపోయింది.. పాత్రలేమిటో, గ్రాఫిక్స్ ఏ స్థాయిలో వాడారో తెలిసిపోయింది.. ఇప్పుడు మిగిలిన సస్పెన్సల్లా.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేదే. ఈ ఒక్క పాయింట్ పట్టుకుని వచ్చే ఏప్రిల్ వరకూ రాజమౌళి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేయగలగాలి. మిగతా సినిమా.. అంటే.. ప్రభాస్ రానాపై పగ తీర్చుకోవడం.. అనుష్క.. రానాకు పేర్చిన చితిలో అతడిని కాల్చేయడం లాంటివి.. ప్రేక్షకుడు ఎటూ ఊహించుకునేశాడు. కొందరైతే.. సెకండ్ పార్ట్ మొత్తం ఊహించుకుని తమకు తోచినట్టు తీసి యూట్యూబ్ లో సైతం అప్ లోడ్ చేసేశారు. అందుకే ఈసారీ ప్రమోషన్స్ లో కచ్చితంగా సినిమాలోని ఏదో ఒక ఆసక్తికరమైన అంశాన్ని రాజమౌళి రివీల్ చేయాల్సుంటుంది. అప్పుడే వచ్చే ఏప్రిల్ వరకూ సినిమా కోసం ప్రేక్షకులను బాహుబలి 2 కోసం ఎదురుచూసేలా రాజమౌళి చేయగలడు. బాహుబలి ఫస్ట్ పార్ట్ కు వచ్చిన క్రేజ్ ను రాబట్టుకోగలడు.

Similar News