మెగాహీరో రాంచరణ్ తో పాటు అగ్రహీరోలత చేసిన ట్రాక్ రికార్డు ఉన్న అమలాపాల్.. ఇప్పటికీ కేవలం కామెడీ హీరో అనే ట్యాగ్ లైన్ మాత్రమే కలిగి ఉన్న హీరో అల్లరి నరేష్ తో చేస్తోందా? ఆ సంగతి ఆమె వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక గానీ ఖరారయ్యే అవకాశం లేదు.
అనీష్ కృఫ్ణ దర్శకత్వంలో అల్లరి నరేష్ ఓ చిత్రం చేయబోతున్నారు. మళయాళంలో విజయవంతం అయిన ఓ చిత్రం రీమేక్ గా దీనిని రూపొందిస్తున్నారు. డిసెంబర్ లో సెట్స్ మీదికి వెళ్లను న్న చిత్రం కోసం కొన్నాళ్లుగా హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. తాజాగా గతంలో రాంచరణ్ తో చేసిన అమలాపాల్ ను సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అమలాపాల్ భర్తతో విభేదాలు వచ్చిన తర్వాత.. మళ్లీ సినిమాలవైపు దృష్టి సారిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఆఫర్ వచ్చినా చేసేలా ఉన్నదో... లేదా.. పెళ్లయి, అది విఫలమై రీఎంట్రీ ఇస్తున్నప్పుడు కూడా తన పెద్ద హీరోలతోనే చేస్తానంటూ పట్టుబట్టి కూర్చుంటుందో వేచి చూడాలి. ఒకవేళ అమలాపాల్ ఒప్పుకుని, అల్లరి నరేష్ సరసన చేస్తే మాత్రం సినిమా మార్కెట్ పరంగా మరో రేంజిలో ఉంటుందని అంచనా వేయచ్చు.